గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మా ధ్యేయం
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
నిజాంసాగర్ ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, బంజాపల్లి, సుల్తాన్ నగర్ గ్రామపంచాయతీ భవనాలను, బుధవారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల జీవన విధానాలను మార్చడంతో పాటు, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. జుక్కల్ నియోజకవర్గం ను రోల్ మోడల్ గా తయారు చేయడమే తన ముందున్న కర్తవ్యం అన్నారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్. పిట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు సంకు లక్ష్మయ్య,నాయకులు ప్రజా పండరి,స్థానిక సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




