9 April, 2026 | 3:10 AM

ఎర్రపహడ్ వాసికి ‘దళిత రత్న’ పురస్కారం

09-04-2026 01:01 AM

నూతనకల్ ఏప్రిల్ 8:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా మండల పరిధిలోని , ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన ప్రముఖ డప్పు కళాకారులు ధర్మరపు సైదులుని ప్రతిష్టాత్మక ‘దళిత రత్న’ అవార్డుతో సత్కరించారు.

గత కొన్నేళ్లుగా డప్పు కళాకారుడిగా జాతి ప్రయోజనాల కోసం, అనేక సామాజిక ఉద్యమాలలో పాల్గొని ఆయన అందించిన విశేష సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేసింది. ఉత్సవాల కమిటీ కో-చైర్మన్ డాక్టర్ అల్లిబిల్లీ మహేందర్ గారి చేతుల మీదుగా సైదులు  ఈ అవార్డును అందుకున్నారు.ఈ కార్యక్రమంలో TMRPS అధ్యక్షులు ఇటుక రాజు, దారామల్ల రమేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.