క్రీడా ప్రాంగణం అభివృద్ధి అభినందనీయం
ఘట్ కేసర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : పోచారం సంస్కృతి టౌన్ షిప్ లో ప్రజల అవసరాలకు అనుగుణంగా స్కేటింగ్ ట్రాక్ తో పాటు వివిధ క్రీడలకు వినియోగించుకునే విధంగా అసోసియేషన్ సభ్యులు పార్కును అభివృద్ధి చేయడం అభినందనీయమని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.
ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని సంస్కృతి టౌన్ షిప్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఇందిరా ప్రియదర్శినిల ఆధ్వర్యంలో స్కేటింగ్ ట్రాక్, ఇతర క్రీడలకు వినియోగించుకునే విధంగా క్రీడా ప్రాంగణం అభివృద్దికి సోమవారం తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొని భూమి పూజ చేశారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆహాలదకరమైన వాతావరణం కల్పించే విధంగా పిల్లలకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేలా ఖాళీ స్థలాలను వినియోగంలోకి తీసుకరావడం మంచి పరిణామమన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఘట్ కేసర్ మండల అధ్యక్షుడు కర్రె రాజేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎర్రరాజు, యంనంపేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోలగౌని సహదేవ్ గౌడ్, నాయకులు కొంతం శంకర్ రెడ్డి, రాజేష్ ముదిరెడ్డి, బద్దం వెంకట్ రెడ్డి, చామల శ్రావణ్ కుమార్ రెడ్డి, మెట్టు నర్సింహా రెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి, శశి, నరేష్ గౌడ్, కృష్ణ నాయక్, సయ్యద్ జాఫర్, విజయ్ రెడ్డి, రమేష్, రవీందర్, మహిళా నాయకురాళ్ళు లక్ష్మీ, ప్రమీల, టౌన్ షిప్ అసోసియేషన్ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు.






