పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 20(విజయక్రాంతి): పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కల ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతుందని చెప్పారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 23వ వార్డుకు చెందిన యాడారం మంజుల అశోక్,7వ వార్డుకు చెందిన సాదరి దుర్గమ్మ,9వ వార్డు గిర్మాపూర్ పట్టణానికి చెందిన తలారి భాగ్యలక్ష్మి సురేష్,గోంగుల వెంకటమ్మ ల నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి.మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిహెచ్ రమేష్.మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ లు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభోత్సవాన్ని చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి.కౌడే మహేష్ లు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేదల కళ్ళల్లో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.ఇందిరమ్మ ఇళ్ళు లేని గ్రామాలు,పట్టణాలు లేవని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
సమాజంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఉదండపురం సత్యనారాయణ.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి.హౌసింగ్ కార్పొరేషన్ డిఈ అశోక్ రెడ్డి.ఏఈ సుభాష్ రెడ్డి మున్సిపల్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి.
మున్సిపల్ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులు గుండ శ్రీధర్ కురుమ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగరేణి పోచయ్య.బొక్క రఘుపతి రెడ్డి.రామన్నగారి.సంతోష్ గౌడ్.బండి శ్రీనివాస్ గౌడ్.పంజగారి ఆంజనేయులు.నవీన్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు.






