12 May, 2026 | 10:00 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

యువకుడి అదృశ్యం

24-03-2025 01:34 AM

మిర్యాలగూడ, మార్చి 23:  మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామానికి చెందిన యువకుడు అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలివి.. ఐలాపురం గ్రామానికి చెందిన బానోతు రాజేశ్ (21) ఈ నెల 15న ఇంట్లో మైసమ్మకుంట తండాలోని అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబీకులు  నాటి నుంచి బంధువుల ఇండ్లు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు.

దీంతో రాజేశ్ తండ్రి బానోతు శ్రీను ఈ నెల 18న మిర్యాలగూడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి  పోలీసులు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు రాలేదు. రాజేశ్ ఆచూకీ తెలిసినవారు మిర్యాలగూడ రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ లోకేశ్ కోరారు.