calender_icon.png 11 January, 2026 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ పంపిణీ పారదర్శకంగా ఉండాలి

10-01-2026 12:00:00 AM

పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

సికింద్రాబాద్ జనవరి 9 (విజయ క్రాంతి): బేగంపేట సర్కిల్ పరిధిలోని పికెట్ ఉన్న చౌక ధరల షాపులను పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా పలువురు రేషన్ కార్డు దారులతో నేరుగా మాట్లాడి పిదప ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) పనితీరును ఆయన పరిశీలించారు.

శుక్రవారం సికింద్రాబాద్ బేగంపేట సర్కిల్ పరిధిలోని పికెట్ లో ఉన్న చౌక ధరల దుకాణం (ఎఫ్పీ షాప్ నం. 873/870) ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఎం. రాజీ రెడ్డి, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ కె. శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి సాయి అరుణ్, జిల్లా మేనేజర్, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఏ.ఆర్. కృష్ణవేణి, సహాయ పౌర సరఫరాల అధికారి, బేగంపేట సర్కిల్ కె. సదానందం,డిప్యూటీ తహసీల్దార్ కిరణ్మయి, సీనియర్ చెకింగ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.