calender_icon.png 11 January, 2026 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్‌టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ

10-01-2026 12:00:00 AM

వెంకటాపూర్, జనవరి 9 (విజయక్రాంతి): ములుగు జిల్లా మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాల నందు శుక్రవారం మండల శాఖ అధ్యక్షులు అడిచర్ల రాజయ్య ఆధ్వర్యంలో పిఆర్టియు టీఎస్-2026 క్యాలెండర్ ను ఆవిష్కరించగా.. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి తాళ్లపల్లి ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై.. మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ.. సమాజంలో ఉన్నతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు అని మరియు పేద, బడుగు,బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బొంతల కమలాకర్, స్థానిక పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు టి రాధిక, సోదర సంఘ బాధ్యులు జనగాం బాబురావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కుందూరు సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చిట్టి బొమ్మల శ్రీనివాస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సూత్రాల రవి, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల కిషోర్ బాబు, మండల అసోసియేట్ అధ్యక్షులు వంచ జితేందర్ రెడ్డి, మండల మహిళా ఉపాధ్యక్షురాలు దేవభక్తుని పూర్ణిమ, సీనియర్ సంఘ సభ్యులు సిహెచ్ అంబేద్కర్, బోళ్ల సుధాకర్, జడ్.పి.హెచ్.ఎస్ వెంకటాపూర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎండి ఫరీనా బేగం మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.