విద్య రంగంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలి
- విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కేరాఫ్ అడ్రస్ ప్రభుత్వ పాఠశాలలు
- జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, జూన్ 9 (విజయక్రాంతి) : విద్య రంగంలో మెదక్ జిల్లాను మొదటి స్థానం లో నిలపాలనీ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటిం గ్ హాల్లో గత సం: పదవ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. విద్యారంగంలో జిల్లా ఉన్నత స్థానంలో ఉండాలని సూచించారు. సమాజంలో వ్యక్తి నీ ఉన్నతమైన స్థాయిలో నిలపాలంటే విద్య ద్వారానే సాధ్యం అయితుందన్నారు.
విద్యార్థులు ఐ.ఐ.ఐ.టి వైపే కాకుండా దేశంలో ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటి లలో స్థానాన్ని పొందడానికి, ఎయిమ్స్ లాంటి ఉత్తమమైన వైద్య కళాశాలలో ప్రవేశాలు పొందడానికి ప్రయత్నించాలన్నారు. విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించి భవిష్యత్తులో మంచిస్తాయి లో ఉండాలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా 100 శాతం ఉత్తీర్ణత సాధించిన 91 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, 560 ఆపై మార్కులు పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాన్ని, ఎగ్జిక్యూటివ్ ఫైల్ , డిక్షనరీ మరియు పెన్స్ ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, ఏ ఎం ఓ సుదర్శన మూ ర్తి, కరుణాకర్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి రాజు , సహాయ గణాంక అధికారి నవీన్ , ఎంఈఓ లు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎమ్మార్పీలు , విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.






