calender_icon.png 5 July, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం జిల్లా పోలీసుశాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది

05-07-2025 12:00:00 AM

గంగమ్మ కాలనీ గుత్తి కోయ గ్రామంలో ఏర్పాటు చేసిన 

కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం.. పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 

భద్రాద్రి కొత్తగూడెం , జూలై 4 (విజయ క్రాంతి): ఆదివాసి ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఎస్పి రోహిత్ రాజ్ అన్నారు. శుక్రవారం లక్ష్మిదేవిపల్లి మండలంలోని గంగమ్మ కాలనీ గుత్తికోయ గ్రామంలో లక్ష్మీదేవి పల్లి పోలీసుల ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలకు కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోని యువత,పిల్లలు విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం  అందించాలన్నారు. వర్షాకాలంలో తమ ఇండ్ల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,అధికంగా మురుగు నీరు చేరడం వలన దోమలు అధికమై డెంగ్యూ, మలేరియా,టైఫాయిడ్ వంటి విషపూరిత జ్వరాల బారిన పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు.

అనంతరం ఎస్పీ చేతుల మీదుగా అక్కడ నివసించే 27 కుటుంబాల వారికి దు ప్పట్లు,దోమ తెరలను పంపిణీ చేశారు. విద్యుత్,మొబైల్ నెట్వర్క్ సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ జి నరేందర్, కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,లక్ష్మిదేవిపల్లి ఎస్త్స్ర రమణా రెడ్డి, ఎస్త్స్ర కార్తీక్ పాల్గొన్నారు.