04-07-2025 11:08:09 PM
సిఎంపిఎఫ్ రీజినల్ కమిషనర్ హరిపచౌరి
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి కార్మికులకు ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే సిఎంపిఎఫ్ సేవలు అందించే లా చర్యలు చేపట్టినట్లు సీఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ హరిపచౌరి స్పష్టం చేశారు. ఏరియా లోని జిఎం కార్యాల యం కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంపిఎఫ్, పెన్షన్ లకు సంబంధించిన లావాదేవిలు సి-కేర్స్ పోర్టల్ ద్వారా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే కొత్తగా సీఎంపిఎఫ్ పెన్షన్ కి సంబం ధించిన క్లెయిమ్స్ త్వరగతిన పూర్తి చేయడానికి ప్రయాస్ అనే పద్దతిని అమలు చేశామ న్నారు. బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు జీరో పెండింగ్ గా సీఎంపిఎఫ్ పెన్షన్ క్లైములు సెటిల్ చేస్తున్నామన్నారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సీఎంపిఎఫ్ సేవలను పారదర్శకంగా పొందవచ్చని, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఏరియా జిఎం దేవేందర్ మాట్లాడుతూ ప్రయాస్ ద్వారా సీఎంపిఎఫ్, పెన్షన్ కి సంబందించిన సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటు న్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, సిఎంపిఎఫ్ రీజినల్ కమిషనర్ గోవర్ధన్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డివైపిఎం ఆసిఫ్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శంకర్, సీఎంపిఎఫ్ రీజినల్ ఆఫీసు సిబ్బంది, అన్ని గనుల సంక్షేమ అధికారులు, క్షరికల్ సిబ్బంది పాల్గొన్నారు.