15 May, 2026 | 3:27 AM

పేదల సొంతింటి కల కాంగ్రెస్ హయాంలోనే సాధ్యం

15-05-2026 02:13 AM

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 

భూత్పూర్, మే 14: పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సాధ్యమని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం భూత్పూర్ మండల పరిధిలోని పెద్ద తండా, కొత్తూరు, షేర్ పల్లి, ఆస్నాపూర్ గ్రామాలలో ఇంద్రమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

అనంతరం ఆయా కుటుంబాలకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇల్లు చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడం లబ్ధిదారులు నూతన గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైన ప్రజలకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయించి వారికి విడతల వారీగా వారి ఖాతాల్లో డబ్బులను ఐదు లక్షల నగదు చేయడం జరిగిందని అన్నారు. ఏ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదింటి ప్రజల సొంతింటి కల ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డితో సాధ్యమైనదని పేర్కొన్నారు. గత టిఆర్‌ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలోని ఇల్లు లేని నిరు పేదలను గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి, కౌన్సిలర్ అన్నపూర్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే సి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కీ నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్యానాయక్, ఆనంద్ రెడ్డి, మాధవ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.