9 June, 2026 | 1:21 AM

వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి..

09-06-2026 12:00 AM

మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ 

అయిజ, జూన్ 8:  అయిజ మున్సిపాలిటీ లోని 8,9 వార్డులలో భరత్ నగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల నందు 99 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ ఆధ్వర్యంలో వార్డుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ సురేష్ మాట్లాడుతూ అర్హులైన వారందరూ పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలని మరియు వార్డులలో మౌలిక సదుపాయాలు భగీరథ నీళ్లు, వీధి దీపాలు, డ్రైనేజ్ మొదలగు సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురావాలని త్వరిత గతిన పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అన్నారు. వార్డు ప్రజలతో సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాల నరసింహులు, మున్సిపల్  కమిషనర్ చంద్రశేఖర రావు, కో ఆప్షన్ నెంబర్ నాగన్న గౌడ్ మహిళా సంఘాలు వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు మొదలగువారు హాజరయ్యారు.