17 March, 2026 | 9:01 PM

వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

08-01-2026 01:28 AM

రాజాపూర్, జనవరి 7: ప్రతి వాహనదారుడు రహదారి భద్రత నియమాలు పాటించి వాహనాలు గడపాలని జిల్లా పిఎల్ వీ నయుముద్దీన్ పేర్కొన్నారు .బుధవారం రాజాపూర్ మండల కేంద్రంలో రహదారి భద్రత వారోత్సవాలు భాగంగా అవగాహన కల్పించారు.

పోలీసులు, సీనియర్ సిటిజెన్లు,  యువకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ మండల అధ్యక్షుడు జహంగీర్, బుచ్చిరెడ్డి, పద్మయ్య, బాలరాజ్, నారాయణ, జిలాని, వెంకట్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.