calender_icon.png 9 January, 2026 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనసేన బీసీ విభగ అధ్యక్షుడిగా రాజ్‌కుమార్

08-01-2026 01:26:37 AM

మహబూబ్ నగర్, జనవరి 7 : గ్రామాల్లో బీసీలకు ఉన్న సమస్యలు, అవసరరాలు గుర్తించి పరిష్కారం చూపడమే బీసీ జనసేన ముందడుగు వేస్తుందని వెల్లడించారు. జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్ప బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ ఏల్పటి రాజ్ కుమార్ ను నియమించారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎల్పటి రాజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా బీసీ జనసేన కమిటీలకు శ్రీకారం చుట్టడమే మా అంతిమ లక్ష్యం అన్నారు.

ముఖ్యంగా పాఠశాలలో, హాస్టల్స్ లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు,ఇబ్బందులను పరిష్కారం చూపి వారికి అవగాహనా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీసీ జనసేన అంటేనే జనాల కోసం అనేలా ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు ఉన్నారు.