08-01-2026 01:28:08 AM
సిర్గాపూర్ జనవరి 7: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో మహిళ టీచరు ఒత్తిడి చేయడం వల్లనే తమ ఇన్చార్జి హెచ్‌ఎంపై ఓ మీడియా ఛానల్ ఎదుట మంగళవారం నాడు ఆరోపణలు చేశామని సిర్గాపూర్ హైస్కూల్ కి చెందిన (హాస్టల్) విద్యార్థులు బుధవారం మీడియాతో మాట్లాడుతూ... స్పష్టం చేశారు. మహిళా సాంఘిక శాస్త్రం చెప్పే టీచర్, ఇంచార్జ్ హెచ్‌ఎం మధ్య పాత గొడవలను, సమస్యగా సృష్టించారని చెప్పారు. ఇన్చార్జ్ హెచ్‌ఎం తమకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని ఇదంతా సాంఘిక శాస్త్రం టీచర్ చిప్పినట్టే చెప్పమని వివరించారు.