21 April, 2026 | 4:43 AM

ఓటు హక్కుతో ఓర్బన్‌కు గుణపాఠం

21-04-2026 03:13 AM

హంగేరిలో నియంతృత్వ పాలనకు చరమగీతం

బుడాపెస్ట్, ఏప్రిల్ ౨౦: హంగేరీ రాజకీయ యవనికపై 16 ఏళ్ల పాటు తిరుగులేని నేతగా వెలిగిన విక్టర్ ఓర్బన్ ఒక్కసారిగా అధికారాన్ని కోల్పోయి మట్టికరుచుకున్నారు. పాలనాదక్షుడిగా, అజాతశత్రువు గా పేరున్న పతనానికి బంధుప్రీతి, ఆశ్రిత పాక్షపాతం, అవినీతి, బంధుప్రీతి, నియంతృత్వ పో కడలే కారణం. ఒకప్పుడు ‘రాజాధిరాజా’ అని కొనియాడిన ప్రజలే ఆయన్ను ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గద్దె దించేశారు.

ఆయ న నేతృత్వం వహిస్తున్న ఫిడెస్ కూటమికి ఘో ర పరాజయాన్ని చవి చూపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత శక్తిమంతమై నదో తెలుసుకోవాలంటే హంగేరీ తాజాగా ప్రజలు ఇచ్చిన తీర్పే చక్కటి ఉదాహరణ. ప్రజాస్వామ్య వ్యవస్థలను తన గుప్పిట్లోకి తెచ్చుకుందామనుకున్న ఓర్బన్‌కు ఓటర్లు తగిన గుణపాఠం నేర్పారు. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడూ శాశ్వతం కాదని ఈ ఫలితాలు నిరూపించాయి. పాలకుల అణచివేత ధోరణిని ప్రజలు సహించబోరని హంగేరీ ఓటర్లు చాటి చెప్పారు.

పతనం వెనుక కారణాలు

సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు నుంచి విక్టర్ ఓర్బన్ పాలన గాడితప్పింది. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి పేరుకున్నది. క్రోని క్యాపిటలిజం రాజ్యమేలింది. ఆర్థిక వ్యవస్థ కుంటుపడంది. నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. ఈ పరిణామాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆదాయం తగ్గిపోయింది. నిరుద్యోగ సమస్య కారణంగా యువత అల్లాడిపోయింది. ఓర్బన్ తన సన్నిహితులకు ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పగించ డం పెద్ద ఎత్తున ప్రజావ్యతిరేకతను తీసుకువచ్చింది. న్యాయవ్యవస్థ, మీడియాను సైతం ఓర్బన్ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు.

కోర్టుల్లో తన అనుకూల వ్యక్తులను నియమించుకుని తీర్పులనూ ప్రభావితం చేశాడు. పత్రికా స్వేచ్ఛ ను హరించి కేవలం ప్రభుత్వ భజన చేసేలా మీడియా సంస్థలను మార్చాడు. ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాకుండా వాటి గొంతు నొక్కాడు. దీనికి తోడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్ సైన్యాన్ని రంగంలోకి దిం చాడు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే వారిపై సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. సమాచార వ్యవస్థను నియంత్రించేందుకూ ప్రయత్నించాడు.

దెబ్బకొట్టిన ఆశ్రిత పక్షపాతం

విక్టర్ ఓర్బన్ తన పాలనలో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లారు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక పారిశ్రామికవేత్త కేవలం కొద్ది కాలంలోనే దేశంలో నే అత్యంత ధనవంతుడిగా ఎదిగాడు. ప్రభుత్వ కాంట్రాక్టులను కేవలం తమకు అనుకూలంగా ఉండే కొద్దిమంది వ్యక్తులకు మాత్రమే దక్కేలా ఓర్బన్ నిర్ణయాలు తీసుకున్నాడు. కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే నిధులు కేవలం తన పార్టీ కే దక్కేలా నిబంధనలు మార్చారు. ఎన్నికల ని ర్వహణ సంస్థను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు.

దీనివల్ల విపక్షాలకు ఎన్నికల్లో సమా న అవకాశాలు లేకుండా పోయాయి. అంతర్జాతీయ వేదికలపై ఓర్బన్ అనుసరించిన విధా నాలు ప్రజావ్యతిరేకతను తీసుకువచ్చాయి. రష్యా వంటి దేశాలతో ఆయన అతిగా సన్నిహితంగా మెలిగి, యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు దూరయమ్యారు. దీనివల్ల హంగేరీకి అందాల్సిన ఈయూ నిధులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాజంలో విభజన తీసుకురావడం ద్వారా ఓర్బన్ తన అధికారాన్ని కాపాడుకోవాలని చూశాడు.

‘డివైడ్ అండ్ కాంకర్’ అనే సూత్రాన్ని అమలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చాడు. సమాజంలోని వివిధ వర్గాల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకొన్నాడు. ఓర్బన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో విడదీయలేని సంబంధం ఉంది. ట్రంప్ స్వయంగా ఓర్బన్ ఎన్నికల ప్రచారానికి మద్దతు తెలిపారు. ఓర్బన్ కూడా ట్రంప్ కోసం అమెరికా ఎన్నికల సమయంలో విస్తృతంగా ర్యాలీలు నిర్వహించారు.

ట్రంప్ తో పాటు వాన్స్, పుతిన్, లావ్రోవ్ వంటి నేతల మద్దతు ఓర్బన్ కు పుష్కలంగా లభించింది. ఇంతమంది అంతర్జాతీయ హేమాహేమీల మద్దతు ఉన్నా హంగేరీ ప్రజల ఆగ్రహం ముందు ఓర్బన్ నిలవలేకపోయారు. అయితే.. ఓర్బన్ విషయాన్ని ఆ దేశపు జెన్‌జెడ్ జనరేషన్ పెద్ద పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఆ దేశపు యువత నియంతృత్వపాలనపై ఎందుకు మౌనంగా ఉన్నారనే అంశంపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ నడుస్తున్నది.

కొత్త ప్రధానిగా పీటర్ మగ్యార్

హంగేరి కొత్త ప్రధానిగా పీటర్ మగ్యార్ ఎన్నికయ్యారు. ఈయన ఒకప్పుడు ఓర్బన్‌కు సన్నిహితుడే. ఓర్బన్ తీసుకుంటున్న నిర్ణయాలు పీటర్‌కు నచ్చేవి కావు. దీంతో కొన్నేళ్ల క్రితం పీటర్ తీస్సా పార్టీని స్థాపించారు. మరికొందరు సహచరులతో ఆయన జనం మద్ద తు కూడగట్టారు. దేశవ్యాప్తంగా 199 పార్లెమెంట్ స్థానాలు ఉండగా, ఏకంగా 141 స్థా నాలను కైవసం చేసుకున్నారు. తద్వారా ఓర్బ న్ నియంతృత్వ పాలనకు తెరదించారు.