24 March, 2026 | 11:03 AM

ఇంధన రంగం ఊగిసలాట

24-03-2026 12:11 AM

సుంకవల్లి సత్తిరాజు :

ప్రస్తుతం ప్రపంచమంతా క్షణం క్షణం భయంతో బతుకుతున్న ది. అంతర్జాతీయ పరిస్థితులను ఇతర దేశాలు మౌనంగా సమీక్షించుకుంటుంటే, అమెరికా-, ఇజ్రాయిల్,- ఇరాన్ మాత్రం ప్రపంచ జీవనాడులైన గల్ఫ్‌లోని చమురు, సహజ వాయువు క్షేత్రాలను టార్గెట్ చేశాయి. ఈ పరిణామం ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉంది. ఇరాన్ మిలటరీ బేస్ లపై దాడి చేసిన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇటీవల తమ యుద్ధ నీతిని మార్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి.

తమ దేశా న్ని శతృదుర్భేద్యంగా మార్చుకోవడానికి ఇజ్రాయెల్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఇరాన్‌ను నాశనం చేసి, ఆ దేపు అణు శక్తి ని పూర్తిగా విచ్ఛిన్నం చేయాలని ఇజ్రాయె ల్ భావిస్తున్నది. ఇరాన్ ప్రధాన ఆర్థిక వనరులైన చమురు క్షేత్రాలను దెబ్బతీయడం ద్వారా తమకు ఇక ఎదురుండదని ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తెలివిగా పావులు కదిపారు. ఎక్కడో ఉన్న అమెరికాను రెచ్చగొట్టి, ఆ దేశ సైన్యాన్ని, యుద్ధ విమానాలను రప్పించి భారీ క్షిపణులతో ఇరాన్‌ను నామరూపాలు లేకుండా చేయాలని ఆయన పథకం వేశారు.

ప్రతీకార జ్వాలల్లో రాస్ లఫాన్ విధ్వంసం

అమెరికాకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా ఇరాన్‌కు చెందిన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇటీవల ఇజ్రాయెల్ దాడికి తెగబడింది. ఇరాన ఈ చర్యకు ప్రతీకారం గా ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని ఎల్‌ఎన్జీ ఉత్పత్తి క్షేత్రంపై విరుచుకుపడింది. రాస్ లఫాన్ పై జరిగిన ఈ దాడితో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలి క్కి పడ్డాయి. అనేక దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ ఒక్క రోజులోనే సుమారు 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది.

ఇజ్రాయెల్ చేసిన ఈ చర్య ను అమెరికా కూడా ఖండించింది. ఇందు లో తమకు ఎలాంటి ప్రమేయం లేదని కూడా ప్రకటించింది. అయితే, ఈ మాట ల్లో నిజమెంతో ఎవరికీ తెలియదు. అబద్ధాల పుట్టగా పేరున్న ట్రంప్ మాటలను అంత సులభంగా విశ్వసించలేం.

చమురు బావుల పైన, రిఫైనరీల పైన దాడులు చేయొద్దని ఇజ్రాయెల్‌ను అమెరికా హెచ్చరించినట్లు వివిధ వర్గాల నుంచి విదితమ వుతోంది. గల్ఫ్ దేశాల్లో అంటుకున్న ఈ ఆయిల్ మంటలతో ప్రపంచ దేశాలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. చమురు కొరత ఏర్పడుతుందనే భయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.

కుప్పకూలిన ఇంధన జీవనాడి

ప్రపంచంలోని పలు దేశాల గ్యాస్ సరఫరాకు జీవనాడిగా భావిస్తున్న రాస్ లఫా న్ ఆయిల్ క్షేత్రంపై జరిగిన దాడి ప్రపంచ ప్రజలను భయకంపితులను చేసింది. ఈ భారీ రిఫైనరీని మరమ్మతులు చేయడాని కి, చమురు క్షేత్రాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి సుమారు ఐదేళ్ల వ్యవధి పడుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ ఇంతటి విధ్వంసానికి తలపడడానికి వెనుక అనేక కారణాలు ఉన్నాయి.

ఇరాన్‌లోని బాలికల పాఠశాలపై దాడి చేసిన అమెరికా, అమాయకులైన 165 మంది విద్యార్థులను చం పిన సంఘటన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ (ఐఆర్జీసీ) లో ప్రతీకారేచ్ఛను రగిల్చింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది ఒక ప్రధా న ప్రేరణగా మారింది.

గల్ఫ్ దేశాల్లో అమెరికా తన స్థావరాలను ఏర్పరచుకుని ఆ ప్రాంతాన్ని శాసించాలనుకోవడం ఇరాన్కు నచ్చడం లేదు. ఇరాన్ చమురు క్షేత్రాలపై కన్నేయడం, ప్రాచీన ఇరాన్ సంస్కృతిని నాశనం చేయడం వంటి చర్యలు ఆగ్రహానికి దారితీశాయి. ఇరాన్‌కు వ్యతిరేకంగా గల్ఫ్ దేశాలు అమెరికాతో చేతులు కలపడంతోనే ఇరాన్ ఆయా దేశాలపై దాడుల కు దిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పరిస్థితులు .. వ్యూహాలు

మొదట్లో అమెరికాను సమర్థించిన ఇరాన్ ప్రజలు ఆ తర్వాత మౌనం వహించారు. బాలికలు, మహిళల విషయంలో విధించిన కఠిన నిబంధనలకు, నిర్బంధాలకు, శిక్షలకు వ్యతిరేకంగా అయతుల్లా ఖమేనీని ఇరాన్ ప్రజలు వ్యతిరేకించారు. ఆధునిక సమాజం ఖమేనీ నియంతృత్వాన్ని ఎప్పుడూ హర్షించలేదు. అందుకే ప్రజలు వీధుల్లోకి వచ్చి భారీ నిరసనలు తెలిపారు. ఇరాన్ ప్రజలే ఆ దేశంలో అంతర్యుద్ధానికి తలపడతారని, ఈ సివిల్ వార్ తో తమ లక్ష్యం సులభంగా నెరవేరుతుందని ఇజ్రాయెల్, అమెరికా దేశాలు భావిం చాయి.

ఖమేనీ అంతంతో యుద్ధం ముగిసినట్టేనని, ఆ తర్వాత ఇరాన్‌ను తమకు నచ్చినట్లు పునర్నిర్మించుకోవాలని ట్రంప్ భావించినప్పటికీ, ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చమురు స్తంభన నెలకొన్నది. ఖతారక్షలోని భారీ ఎనర్జీ ఫెసిలిటీపై జరిగిన భీభత్సకాండతో భారత ప్రభుత్వంలో కూడా తీవ్ర ఆందోళన చెలరేగింది. భారత్‌లో ఎంత కాలానికి సరిపడా చమురు నిల్వలు ఉన్నాయో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.

భారత్‌లోనూ యుద్ధ ప్రభావం

చమురు సంక్షోభం ప్రభావం భారత్‌పైనా ఉంది. ఇప్పటికే వంట గ్యాస్ సిలిం డర్ల బుకింగ్స్‌పై కఠినమైన పరిమితులు వచ్చేశాయి. గ్యాస్ సిలిండర్ల దొరక్క ఇప్పటికే దేశవ్యాప్తంగా చిన్న చిన్న టిఫిన్ సెంట ర్లు, హోటళ్ల యజమానులు తమ వ్యాపారాన్ని మూసివేశారు. ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో ఎవరికీ అ ర్థం కావడం లేదు. యుద్ధాన్ని ఆపితే అవమాన భారం మోయవలసి వస్తుందని ట్రంప్ ఒకవైపు భావిస్తుంటే, మరోవైపు అమెరికా ప్రజలు ట్రంప్‌ను ఛీత్కరించుకుంటూ రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తు న్నారు.

మరోవైపు, ట్రంప్‌కు నాటో, ఈయూ దేశాల నుంచి సహకారం కొరవడింది. మిత్ర దేశాల సహాయం అర్థించిన అమెరికా విన్నపాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. తమకు ఎవరి సహాయం అక్క రలేదని ట్రంప్ చెప్పడం మరో విడ్డూరం. ప్రస్తుతం చమురు ధరలు విపరీతంగా పెరగడం వల్ల పలు దేశాల్లో కదలిక ఏర్పడిం ది. సౌదీ అరేబియా, కువైట్, దుబాయ్, యూఏఈ, ఖతార్ చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేస్తుంటే, భరోసా ఇవ్వాల్సిన అమెరికా మరింత సంక్షోభాన్ని రాజేస్తోంది.

రాస్ లఫాన్ ప్రాముఖ్యత 

రాస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం ఇజ్రాయెల్ దాడిలో విధ్వంసం కావడంతో ఖతార్ ఖం గుతిన్నది. తమ దశాబ్దాల శ్రమ అగ్నికి ఆ హుతైంది. కాసుల వర్షం కురిపించే రాస్ లఫాన్ బూడిదగా మారింది. ఖతార్ ఆశల సౌధం కనుమరుగై నిశ్శబ్దంలో కలిసిపోయింది. యుద్ధోన్మాదం, అహంకారం ఎం తటి విధ్వంసానికి దారితీస్తుందో కళ్ల ముం దు గల వాస్తవం క్షణాల్లో కలలా మిగిలిపోయిన రాస్ లఫాన్ ఉదంతమే ప్రత్యక్ష తా ర్కాణం.

ఖతార్ చాలా చిన్న దేశమైనప్పటికీ, అక్కడ ఉన్న ఎల్‌ఎన్‌జీ ఇండస్ట్రియల్ ప్రాంతం రాస్ లఫాన్ అతిపెద్ద ఎనర్జీ ఉత్పత్తి, ఎగుమతికి ప్రధాన కేంద్రం. ఖతా ర్ లక్షలాది టన్నుల లిక్విఫైడ్ గ్యాస్ ఉత్పత్తి చేస్తూ, ప్రపంచ దేశాల ఇంధన అవసరాలు తీర్చడం విశేషం. గత సంవత్సరంలో ఖతార్ రాజకుటుంబం ట్రంప్‌ను సకల మర్యాదలతో గౌరవించి ’ఫ్లయింగ్ ప్యాలెస్’గా పిలవబడే 400 మిలియన్ డాలర్ల జంబో జెట్ విమానాన్ని బహుమతిగా ఇ చ్చింది.

ఇది కూడా ఇరాన్ ఆగ్రహానికి ఒక కారణం కావచ్చు. -భారత్ కూడా రాస్ లఫాన్ నుంచి ఎల్‌ఎన్‌జీ దిగుమతి చేసుకుంటున్నది. ఇప్పుడు ఇరాన్ దాడితో ఈ ఎనర్జీ కేంద్రం పూర్తిగా విధ్వంసమైంది. దీనిని పునరుద్ధరించడానికి ఐదేళ్ల సమ యం పడుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఖతార్ నుంచి గ్యాస్ దిగుమ తుల ఆశలు ఇరాన్ దెబ్బతో ఆవిరైపోయా యి. ఇప్పుడు ఇరాన్ ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. ఏది ఏమైనప్పటికీ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ప్రజా ప్రయోజనాల రీత్యా సంయమనం పాటించాలి. చమురు క్షేత్రాలపైన దాడులను ఆపాలి. ట్రంప్ తన అహాన్ని విడిచి యుద్ధానికి ముగింపు పలకాలి. ఇరాన్ కూడా పట్టుదలకు పోకుండా యుద్ధ విరమణకు సహకరించాలి.

 వ్యాసకర్త సెల్: 97049 03463