తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే
మేడ్చల్ జిల్లా కార్యదర్శి సింగిరెడ్డి నరేందర్ రెడ్డి
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని మేడ్చల్ జిల్లా బిజెపి కార్యదర్శి సింగిరెడ్డి నరేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేపు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.
అంతేకాకుండా భారతదేశంలో పేద పొడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని ఆయన వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని నరేందర్ రెడ్డి వెల్లడించారు.






