9 May, 2026 | 6:17 PM

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు

09-05-2026 04:55 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని మేడ్చల్ ఐఎన్టియుసి ఆటో యూనియన్ అధ్యక్షులు కర్ర విజయ్ రావు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దాయర కీసర ప్రాంతంలోని వెంకటేశ్వర ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ నరేందర్ రెడ్డిని విజయ్ రావు కలిసి నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా డిసిసి అధ్యక్షులు వజ్రెష్ యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్, హరి వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.