11 April, 2026 | 3:52 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

గులాబీ ఆకర్ష్.. హస్తం బేజారు

03-02-2026 02:30 AM

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కంగారు..

కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై పెదవివిరుపు..

హస్తం పార్టీని వీడుతున్న నాయకులు..

మెదక్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్లో చేరికల జోష్ కనిపిస్తున్నది. హస్తం పార్టీ నాయకులు బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు. మళ్లీ అభివృద్ధి జరగాలన్నా.. సంక్షేమ పథకాలు అమ లు కావాలన్నా కేసీఆర్ రావాలన్న అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తమ మద్దతు అవసరమని భావిస్తూ.. గులాబీ పార్టీలోకి వస్తున్నారు. మెదక్ జిల్లాలోని మె దక్, నర్సాపూర్, రామాయంపెట్, తూప్రాన్ మున్సిపాలిటీ ల నుంచి కాంగ్రెస్ పార్టీ నేత లు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు.

మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ఎన్నికలపై సీరియస్గా దృష్టి సా రించింది. ఇప్పటికే మెదక్ జిల్లా వ్యాప్తంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మ కంగా తీసుకుంది. గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ప ద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇం చార్జి, మాజీ mlc ఫారూక్ హుస్సేన్ వరుస సమీక్షలతో కేడర్లో జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే పట్టణ ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకోవడానికి బీఆర్‌ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. 

టార్గెట్ మున్సిపోల్స్..

మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ దూ కుడు ప్రదర్శిస్తోంది. మెదక్ జిల్లాలో నాలు గు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నిక ల్లో తమ మద్దతుదారులు మంచి ఫలితాలు సాధించారని, అదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని బీఆర్‌ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. పట్టణ ఓటర్లు ఎప్పుడూ అభివృద్ధిని కోరుకుంటారని తమవైపే ఉంటారని బీఆర్‌ఎస్ నేతలు చెబుతు న్నారు. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

కాంగ్రెస్ పాలనపై అస్త్రాలు..

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగట్టాలని నిర్ణయించుకుంది. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పనులకు ఖర్చు చేయలేదని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

రేవంత్రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ, పలు పథకాల నిర్వహణను కాంగ్రెస్ గాలికొదిలేసిందని విమర్శిస్తున్నారు.