03-02-2026 02:28:47 AM
చివరి వరకు అధికార పార్టీ వేచి చూసి బీఫామ్ అందజేత
చివరి రోజు వరకు ప్రతిపక్ష పార్టీలు బి ఫామ్ ఇవ్వడానికి ఎదురుచూపు
కామారెడ్డి, ఫిబ్రవరి 02 (విజయక్రాంతి): బీ ఫామ్ ల పంపిణీలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం మున్సిపల్ ఎన్నికల్లో ఎత్తుకు పై ఎత్తివేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేశారు. చివరి సమయం వరకు బీఫాం కేటాయింపు లో అధికార కాంగ్రెస్ పార్టీ చివరి వరకు వేచి చూసే దొరనని అవలంబించింది. కాంగ్రెస్ పార్టీ లో బీఫామ్ ఆశించిన అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉండడంతో కాంగ్రెస్లో బీఫామ్ రాకుంటే ప్రతిపక్ష పార్టీల లో ఇస్తామని భావించిన ప్రతిపక్ష పార్టీల నేతలకు అధికార పార్టీ చెక్ పెట్టింది.
ప్రతిపక్ష పార్టీలైన బిజెపి, బిఆర్‌ఎస్ కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి బాన్సువాడ ఎల్లారెడ్డి బిచ్కుంద మున్సిపాలిటీలో తమ పార్టీ అభ్యర్థులకు బి ఫామ్ కేటాయింపులపై ఎత్తుకు పై ఎత్తు వేస్తూ చివరి రోజు వరకు బీఫాములను అభ్యర్థులకు కట్టబెట్టలేదు. ప్రతిపక్ష పార్టీలైన బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల నేతలు తమ అభ్యర్థుల కు బి ఫామ్ లు కేటాయిం ఇచ్చిన అనంతరమే అధికార కాంగ్రెస్ పార్టీ బీఫాములను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
పార్టీ నేతలు అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపిక లో ఎత్తుకు పై ఎత్తు వేస్తూ బీఫామ్ ఇచ్చేందుకు వేచి చూసే ధోరణి నీ అవలంబించాయి. దీంతో పోటీ చేయాలని భావించిన అభ్యర్థులకు బీఫామ్ చేతిలోకి రాకపోవడంతో ప్రచారంలో వెనుకడుగు వేశారు. బీఫామ్ చేతికి వస్తేనే ప్రచారం ప్రారంభిస్తామని అభ్యర్థులు ప్రారంభిస్తామని చెప్పడంతో బిజెపి, బి ఆర్ ఎస్ పార్టీలు తమ అభ్యర్థులకు బి ఫామ్ లను చివరి రోజు అందజేశారు. దీంతో బీఫాంలో కోసం అభ్యర్థులకు చివరి వరకు టెన్షన్ పట్టుకుంది.
కొందరికి నిరాశే ఎదురు
పార్టీల బీఫామ్ ఆశించిన కొంతమంది ఆశవా హూలకు చివరి నిమిషంలో బీఫామ్ చేతికి దక్కకపోవడంతో కొందరు స్వతంత్రంగా పోటీలో ఉన్నారు. మరికొందరు సీనియర్ నేతల సూచనల మేరకు విత్ డ్రా చేసుకునేందుకు ముందుకు వచ్చారు. మంగళవారం విత్ డ్రా చేసుకునేది ఎవరో బరిలో ఉండేది ఎవరో తేల నుoది. చివరి వరకు పార్టీల నేతలు ఒకరి కంటే ఒకరు ఎత్తుకు పై ఎత్తు వేసి బీపాములను పంపిణీ చేశారు. బి ఫామ్ లో కేటాయింపు జరగడంతో ఆశావాహులైన అభ్యర్థు లు ఊపిరిపీల్చుకున్నారు.