7 July, 2026 | 4:01 PM

Breaking News

సర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్   •   భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •  

వెల్‌నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు అభినందనీయం

30-06-2025 02:33 AM

మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్, జూన్ 29( విజయ క్రాంతి ): వెల్ నెస్ అడ్వాన్సుడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిజామాబాదులో ప్రారంభించడం అభినందనీయమని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కు దీటుగా కార్పొరేట్ హాస్పిటల్ కు ఏ మాత్రం తీసిపోకుండా, అత్యాధునిక వైద్య విధానంతో ఏడవ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఆదివారం వెల్ నెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను యాజమాన్యం సుమన్ గౌడ్, వివేకానంద రెడ్డి, అసద్ ఖాన్, నిజామాబాద్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ ల ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ముందర ప్రారంభించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహీర్ బీన్ హందాన్, నూడ చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి హాజరయ్యారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు నిర్వహించి, హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హాస్పిటల్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, గైనాలజీ, ఈ ఎన్ టీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్ కు సంబంధించిన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

అతి తక్కువ ధరలతో కార్పొరేట్ వైద్యం నిజామాబాదులో అందించాలన్న సంకల్పంతో ఇక్కడ ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రముఖ వైద్యులు, హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.