7 July, 2026 | 2:55 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

రేపు ‘బనకచర్ల’పై ప్రజెంటేషన్

30-06-2025 02:33 AM
  1. మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో నిర్వహణ
  2. ఏపీ ప్రభుత్వ ఉల్లంఘనలపై వివరణ
  3. హాజరు కానున్న సీఎం 

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ప్రజాభ వన్‌లో మంగళవారం రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కు మార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ప్రభు త్వం ఆ రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగనున్నది. రాష్ట్రనీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రజెంటేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరుకానున్నారు. మంత్రి ఉత్తమ్ వారికి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలను, ఏపీ ప్రభుత్వ ఉల్లంఘనలను విశదీకరించనున్నారు.