14 March, 2026 | 2:47 AM

భారీ ‘మెగా ఆర్‌ఏఎం’ రుణ పంపిణీ

14-03-2026 01:26 AM

తెలుగు రాష్ట్రాల్లో రూ.1,422 కోట్ల రుణాలు మంజూరు

ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ

హైదరాబాద్/తిరుపతి, మార్చి 1౩: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రిటైల్, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ(ఆర్‌ఏఎం) రంగాలను ప్రోత్సహించే లక్ష్యంతో భారీ ‘మెగా ఆర్‌ఏఎం క్రెడిట్ అవుట్రీచ్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు రాష్ట్రాల్లోని 8 జోన్లు , 3 మిడ్ కార్పొరేట్ బ్రాంచ్‌ల(ఎంసీబీ) పరిధిలో మొత్తం రూ. 1,422 కోట్ల రుణాలను లబ్ధిదారులకు మంజూరు చేసి, పంపిణీ చేశారు.

తిరుపతిలో జరిగిన ప్రధాన పంపిణీ కార్యక్రమంలో హైదరాబాద్ ఫీల్ జనరల్ మేనేజర్ (ఎఫ్‌జీఎం) ప్రాణేష్ కు మార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి జోనల్ మేనేజర్ సెల్వరాజ్ ఎం సమక్షం లో ఆయన లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రాణేష్ కుమార్ మాట్లాడుతూ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా త్వరితగతిన రుణాలు అందించడమే బ్యాంక్ లక్ష్య మని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఇండ్ స్మార్ట్, ఇండ్ స్మార్ట్ బిజ్ వంటి మొబైల్ అప్లికేషన్ల ద్వారా డిజిటల్ పద్ధతిలో రుణాలు పొంద డం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. బ్యాంక్ అందించిన ఆర్థిక సాయం తో లబ్ధిదారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించి, వారి స్వయం ఉపాధిని అభినందించారు. ఈ కార్యక్రమం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన జోన్ల లో ఆయా జోనల్ మేనేజర్లు, డీఆర్‌డీఏ,  మెప్మా ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఘనంగా జరిగింది.

తెలంగాణలో హైదరాబా ద్ జోనల్ మేనేజర్ కే శ్రీనివాస్, మల్కాజిగిరి జోనల్ మేనేజర్   స్వర్ణ ప్రభ సుందరా య్, కరీంనగర్ జోనల్ మేనేజర్ పీఎస్‌ఎస్ సుధాకర రావు నేతృత్వంలో రుణాలు పంపి ణీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి జోనల్ మేనేజర్ గౌరీ శంకర్ రావు ఎన్, విజయవాడ జోనల్ మేనేజర్  ముచ్చిన రాజేష్, రాజమండ్రి జోనల్ మేనేజర్ కట్టుల రాజ్ కుమార్, విశాఖపట్నం జోనల్ మేనేజర్ అవధేష్ కుమార్ పుర్బే తమ బృందాలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు తోడ్పాటునందించారు.