ఘనంగా భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ జన్మదినం
ఖమ్మం, మార్చి 13 (విజయక్రాంతి): భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణ మూర్తి జన్మదిన వేడుకలు బ్యాంక్ ప్రధాన కార్యాలయం గాంధీచౌక్‌లో శుక్రవారం ఘ నంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్యాంక్ సీఈఓ దాసరి వేణుగోపాల్ మాట్లాడుతూ 1997లో మొదటి శాఖను ఏర్పాటు చేసి నేటికి 25 బ్రాంచ్‌లను పూర్తి చేసుకొని రాష్ట్రంలో 4వ అతి పెద్ద కోఆపరేటివ్ బ్యాంక్ గా భద్రాద్రి పేరుపొందన్నారు. వెయ్యి కోట్ల కు టర్నోవర్ చేరుకుంటూందని, కొన్ని వేల మంది కస్టమర్స్‌కు బ్యాంకింగ్ సేవలను అందిస్తూంది అన్నారు.
ఇది అంతా చైర్మన్ చేతు ల మీదుగా జరగటం హర్షించదగిన విష యమన్నారు. బ్యాంకులో సుమారు 250 మందికిపైగా ఉపాధి పొందుతున్నారని, 1996లో నాటిన చిన్న మొక్క నేడు మహా వృక్షమైందని తెలిపారు. ఈ బ్యాంక్ ము న్ముందు మరింత అగ్రగామిగా వెలుగొందలని ఆశిస్తున్నామని తెలిపారు. కాగా కృష్ణమూర్తి జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్య క్రమంలో బ్యాంక్ ఏజీఎం నాగుబండి శ్రీనివాసరావు, ఇతర శాఖ మేనేజర్లు, ప్రధా న కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.




