ఉన్న గుడిసె పోయే... ఇంటి నిర్మాణం కాక పాయె
- అటవీ శాఖ అడ్డంకులతో ఇందిరమ్మ ఇండ్లకు గ్రహణం
అడ్డంకులు తొలగించి ఇంటి నిర్మాణాలు చెప్పాలని ఆదివాసీల వినతి
ఉట్నూర్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): సొంతింటి కల నిజమవుతుందని ఎంతో ఆశతో ఉన్న గుడిసెను పీకేసి ఇంటి నిర్మా ణం చేపడితే ఉన్న గుడిసె పోయే, ఇంటి నిర్మాణం కాక పోయే అని జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని కొండ కోనల్లో అడవి ప్రాంతం లో నివాసముండే కొలం గిరిజనులకు శాశ్వత గూడు కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ఆదిమ గిరిజన తెగకు చెందిన కొలం, తోటి గిరిజనులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించగానే అటవీ శాఖ అధికారులు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. దీంతో ఇంటి నిర్మాణాలను అడ్డుకోవద్దని పలుమార్లు ఆందోళ నలు చేయడంతో పాటు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు పూర్తి అధికారులు భరోసా ఇచ్చిన, నేటికీ ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.
వచ్చే వేసవి కాలంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడే సమయంలో ఇంటి నిర్మాణాల కోసం నీరు దొరకడం కష్టంగా ఉందని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని, అటవీ శాఖ అధికారుల అడ్డంకులతో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇల్లు పీకేసి బయట ఉంటున్నాం
గుడిసెలో కాలం గడుపుతున్న మాకు ఇందిరమ్మ ఇంటి శుభవార్త కుటుంబ సభ్యులందరం ఆనందపడ్డాం.. ఇంటి నిర్మాణం కోసం గుడిసెను పీకేసి పు నాది తవ్వుతున్న సమయంలో అటవీ శాఖ అధికారులు వచ్చి పనులను అడ్డుకున్నారు. రెండు నెలల నుంచి చలికి వణుకుతూ బయట జీవిస్తున్నాం. ఇప్పటికైనా ఇంటి నిర్మాణం పనులు అనుమతి ఇవ్వాలి.
లేతూ బాయి,మారుతిగూడ, ఉట్నూర్ మండలం
15 ఇండ్లను అడ్డుకుంటున్నారు
ఉట్నూర్ మండలంలోని మారుతి గూడ లోని కొలం గిరిజనులకు 32 ఇం డ్లు మంజూరు చేశారు. 15 ఇండ్ల పనులను అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యే తో పాటు అధికారులకు విన్నవించిన అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి.
-కొడప రామ్ చందర్, గ్రామ పటేల్, మారుతి గూడ
అనుమతి లేనిది ఇంటి నిర్మాణాలు చేపటొద్దు
రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇంటి నిర్మాణాలు చేస్తే అడ్డుకుంటు న్నాం. అటవీ శాఖ చట్టం ప్ర కారంగా అటవీ హక్కు పత్రా లు పొందిన రైతుల చేనులో ఇంటి నిర్మాణాలు చేస్తున్నారని, అట వీ హక్కుల చట్టం వచ్చిన తర్వా త ఏర్పాటైన గ్రామాల్లోనే ఇం డ్ల పనులు అడ్డుకుంటున్నాం.
ఎఫ్‌ఆర్‌ఓ ఇంద్రవెల్లి






