calender_icon.png 1 May, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంటలపై.. దారుల కన్ను

30-04-2025 12:00:00 AM

  1. ప్రభుత్వ భూములే లక్ష్యంగా కబ్జాదారుల అడుగులు 

పదుల సంఖ్యలో ఉన్న కుంటలు సింగిల్ డిజిట్‌కే పరిమితం 

పాలమూరులో కుంటల ఆక్రమణపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు

ఆన్‌లైన్ ఉన్న.. దర్జాగా కట్టలు తెగ్గొడుతుండ్రు 

పర్యవేక్షణ చేస్తున్నాం కేసులు నమోదు చేస్తున్నాం : లక్ష్మణ్, ఇరిగేషన్ శాఖ ఈఈ 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 29 (విజయ క్రాంతి) : ప్రభుత్వ భూములే లక్ష్యంగా కబ్జాదారుల కన్ను పడుతుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో పదుల సంఖ్య లో కుంటలు ఉండేవని.. రోజురోజుకు కనుమరుగవుతూ సింగిల్ డిజిట్ కే కుంటలు పరిమితం అవుతున్నాయి. రావడం జరిగిందని పట్టణంలోని పలువురు ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వ పరిధిలో భూమి ఉంటే చాలు కబ్జాదారులు ఇక అడిగేది ఎవరనుకుంటున్నారు. అధికారులు ఆపుతారా ? వారు వచ్చేలోపే కుంట కట్టల తొలగిస్తారు దర్జాగా పట్టా భూమంటారు. 

అధికారులు చేస్తే గీస్తే కేసులు అంటారు.. ఇంకేం చేస్తారు... అనే విధంగా కొందరు కబ్జాదారులు కుంటల భూములే లక్ష్యంగా మార్చుకున్నారు. కుంటల కబ్జాకు ముగింపు పలికితేనే భవిష్యత్తు తరాలకు ముందు మార్గ నిర్దేశకులుగా నిలుస్తారని సలహాలు సూచనలు సైతం ప్రముఖులు చెప్పడం విశేషం. ఎందుకు పట్టణంలో వరుసగా ఇటీవల రెండు ప్రాంతాల్లో కుంట కట్టల తొలగింపు ప్రక్రియ ఇందుకు నిదర్శమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

పట్టణంలో కుంటలు ఎక్కడ..?

మంచి డిమాండ్ ఉన్న పట్టణ ప్రాంతా ల్లో భూముల విలువ అత్యధికం కావడంతో ప్రభుత్వ భూముల పరిధిలో ఉన్న కుంటలు ఎక్కడ పోయాయో కూడా లెక్కలు లేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుంటలు నాటి నుంచి నేటి వరకు కూడా కనిపిస్తున్న పట్టణంలో కుంటలు మాయం కావడానికి ఎవరు సహకరిస్తున్నారని ప్రశ్న నాటి నుంచి మెదులుతున్న సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది.

ఇరిగేషన్ శాఖ అధికారులు ఎవరో వచ్చి చెప్పి ఫిర్యా దు చేస్తేనో లేదా పత్రికల్లో రాస్తేను తప్ప చర్యలు తీసుకోవడంలో వెనకంజ వేస్తున్నారని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తు న్నారు. ఎక్కడైనా కుంట కట్టలు తొలగింపు తదితర ప్రక్రియ జరిగిన నియంత్రించాల్సిన అధికారులే అటువైపు మేము చూడలేదు ? మాకు తెలియదు? ఇప్పుడే తెలిసింది కేసు పెడుతున్నాం?

కేసులు పెట్టాం? ఇలాంటి సమాధానాలు సంబంధిత ఇరిగేషన్ అధికారుల నుంచి వస్తున్నాయి. అప్పటికే జరగా ల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎక్కడ కుంటలు తొలగింపు కాకుండా చర్య లు కచ్చితంగా అమలుచేసి నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వరుసగా ఘటనలు...

పట్టణంలో ఏనుగొండ పరిధిలోని మౌలాలిగుట్ట దగ్గర కొరం గుట్ట కుంట కట్ట ను తొలగించారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేసినట్లు చెప్పారు. కుంట కట్ట తొలగించి రోజులు గడుస్తున్న అధికారులు మాత్రం కేసు పెట్టి తమకేమీ పట్టదు అన్నట్లు వ్యవహరిస్తున్నారని పట్టణవాసులు చెబుతున్నారు. ఎంవీఎస్ కళాశాల సమీపంలోని దొంగలకుంట అనే పిలువబడే ఉంటా కట్టను ఇటీవ ల భూ పట్టాదారుల అంటూ కుంట కట్ట ను తొలగించారు.

ఈ కుంట కట్టకు గూగుల్ మ్యాప్ ద్వారా ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేక నెంబర్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇలా ఫిర్యాదులు వస్తున్నాయి అలా కుంట లు కట్టలు తెగుతున్నాయి అనే విధంగా పాలమూరు పట్టణంలో వరుస సంఘటనలు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. 

కుంటలను కాపాడుకుంటాం 

గుంటకట్టలు తొలగింపు లేకుండా కాపాడుకుంటూ క ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ముందుకు వెళ్లిన వారిపై ఫిర్యాదుతో పాటు కేసులు సైతం చేస్తాం. ఈ కుంటలకు సంబంధించిన విషయం తెలిసింది కేసులు కూడా నమోదు చేశాము. ఉన్నత అధికారులకు కూడా నివేదిక అందించడం జరిగింది. కుంటలను పూర్తిస్థాయిలో ఎవరు కబ్జా చేయకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం. 

         లక్ష్మణ్, ఇరిగేషన్ శాఖ ఈఈ, మహబూబ్ నగర్