calender_icon.png 26 July, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ జూనియర్ జాతీయ హాకీ జట్టుకు ఎంపిక

25-06-2025 12:12:44 PM

హుజురాబాద్: (విజయక్రాంతి): సబ్ జూనియర్ జాతీయ హాకీ జట్టుకు(Sub-junior national hockey team) కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణానికి చెందిన హాకీ క్రీడాకారినిలు తాళ్లపల్లి మేఘన, జంపాల శివ సంతోషిని ఎంపికైనట్లు హుజురాబాద్ హకీ క్లబ్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, సెక్రటరీ బొడిగె తిరుపతి, జిల్లా ఇంచార్జ్ సెక్రెటరీ తారిక్ హైమద్ బుధవారంతెలిపారు. గత నెల హైదరాబాద్ లోని రైల్వే స్టేడియంలో నిర్వహించిన సబ్ జూనియర్ ఉమెన్ జాతీయస్థాయి ఎంపిక పోటీలో  మంచిప్రతిభ కనపరిచినందుకు  ఎంపిక చేసినట్లు వారు తెలిపారు. వీరి ఎంపిక పట్ల జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ మాజీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, గుడెలుగుల సమ్మయ్య,హాకీ క్లబ్ ఉపాధ్యక్షులు యూసుఫ్, వేముల రవికుమార్, సాదుల శ్యాంసుందర్, రాజేష్ సాయి కృష్ణ, ప్రదీప్, కే రాజేష్, విక్రం  కోచ్ విక్రమ్, వినయ్ తోపాటు సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.