17 April, 2026 | 10:42 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతి

25-06-2025 12:14 PM

ఇల్లెందు టౌన్, (విజయక్రాంతి): ఇల్లందు మండలంలోని మర్రిగూడెం గ్రామపంచాయతీలోని(Marrigudem Gram Panchayat) ఎల్లాపురం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఓ ఇంటిలో జరిగిన విద్యుత్ షాక్ ఘటనలో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఎల్లాపురం గ్రామానికి చెందిన ఏనుగు నరసయ్య తెల్లవారుజామున మూత్ర విసర్జన కోసం బాత్రూంకి వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగకు ఆనుకొని విద్యుత్ షాక్ కు గురయ్యాడు. దీంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తన తండ్రిని కాపాడేందుకు కొడుకు ప్రవీణ్ హుటాహుటిన వెళ్లి ప్రయత్నించగా దురదృష్టవశాత్తు ప్రవీణ్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిని గమనించిన నరసయ్య భార్య ఎర్రమ్మ వారిద్దరిని కాపాడేందుకు ప్రయత్నించి తాను స్పృహ కోల్పోయింది. గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.