5 May, 2026 | 2:58 AM

నేల ఆరోగ్యాన్ని కాపాడితేనే రైతుకు మేలు

05-05-2026 01:00 AM

రైతు అవగాహన సదస్సులో పాల్గొన్న  ఎమ్మెల్యే  మధు సూదన్‌రెడ్డి

దేవరకద్ర, మే 4 : నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పంట మార్పిడితో  రైతులు వ్యవసాయ అధికారులు,శాస్త్ర వేత్తల సూచనలు పాటించి పంటల సాగు చేయాలని ఎమ్మెల్యే జి.మధు సూదన్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలు సోమవారం చిన్నచింతకుంట మండలం వడ్డెమాన్ గ్రామంలో  రైతు వేదికలో రైతులకు శాస్త్రవేత్తల అవగాహన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జి.మధు సూదన్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం చేపడుతున్న రైతు భరోసా,  వినూత్న కార్యక్రమలు అమలు చేస్తుందని తెలిపారు. నేల ఆరోగ్యాన్ని కాపాడటం గురించి పంట మార్పిడి గురించి అధికారులు సుంచించిన పంటల సరళిని పాటించాలని, ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి, శాస్త్ర వేత్తలు సుంచించిన నూతన వంగడాలని  వాడాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాలను ముందుస్తుగా ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి  ఇజ్బందులు కలగడకుండా రైతు పండించిన ప్రతి ధాన్యం గింజని ప్రభుత్వం కొంటుందని రైతులకు తెలిపారు.ఈ కార్యకమంలో జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేష్, డా పి.అర్చన, శాస్త్రవేత్త డాక్టర్ కే కల్యాణి, మండల వ్యవసాయ అధికారి రాజేశ్ ఖన్నా ,మండల పరిషత్ అబివృద్ది ఆధికారి లక్ష్మి నర్సిములు ,వ్యవసాయ విస్తరణ అధికారులు ,గ్రామ సర్పంచ్ ఈశ్వర్ సింగ్ , డీటీ ఎండీ అమీర్  రైతులు పాల్గొన్నారు.