వర్షాలు లేక విలవిలలాడుతున్న రైతన్న
26-06-2026 12:00 AM
స్పింక్లార్స్ తో పత్తి పంటను కాపాడే ప్రయత్నం
బెజ్జంకి, జూన్ 25: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి కీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన ఓ రైతు పత్తి పంట సాగు చేయగా, వర్షాభావం కారణంగా పంట ఎండి పోతుందేమోనన్న భయంతో స్పింక్లార్ ద్వారా నీటిని అందిస్తూ పంటను కాపాడుకునేందుకు శ్రమిస్తున్నాడు.
సాధారణంగా ఈ సమయానికి వర్షాలు కురిసి పంటలకు ఊరట నివ్వాల్సి ఉండగా, వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు అదనపు ఖర్చులు భరిస్తూ బోరు నీటిపై ఆధారపడాల్సి వస్తోంది. విద్యుత్, డీజిల్, నీటి ఖర్చులు పెరగడంతో రైతుల ఆర్థిక భారం మరింత పెరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






