10 June, 2026 | 3:01 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

జాతీయస్థాయి పోటీలకు విద్యార్థినులు ఎంపిక

31-12-2025 12:39 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 30(విజయ క్రాంతి): బెంగళూరులో డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి జూనియర్ బాలికల ఖోఖో పోటీలకు ఆసిఫాబాద్‌లోని గిరిజన క్రీడా పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థినులు ఎంపిక య్యారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన జంగు బాయి, నాగేశ్వరి, వైష్ణవి, శ్రీలత, సోనీ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబరావు, వ్యాయా మ ఉపాధ్యాయుడు బండ మీనారెడ్డి తెలిపా రు.

ఎంపికైన క్రీడాకారిణులను, శిక్షణ అందిస్తున్న ఖోఖో శిక్షకుడు వాసం తిరుమల్ను ఐటీ డీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ యువరాజ్ మర్మాట్ ,గి రిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. రమాదేవి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ ఉద్దవ్, క్రీడల అధికారి మడవి షేక్, జీసీడీఓ శకుంతల, ఏటిడీఓ శివకృష్ణ, హెచ్డబ్ల్యుఓ సాయిబాబా, పాఠశాల ఉపాధ్యాయు డు జంగు, శిక్షకులు అరవింద్, విద్యాసాగర్ క్రీడాకారిణులకు అభినందనలు తెలిపారు.