calender_icon.png 31 December, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న గ్రీన్ కోర్ ఎగ్జిబిషన్

31-12-2025 12:40:38 AM

మంచిర్యాల టౌన్, డిసెంబర్ 30 : మంచిర్యాలలోని జిల్లా సైన్స్ సెంటర్ లో మంగళ వారం జాతీయ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ‘వేస్ట్ టు వెల్త్’ అనే అంశంపై నిర్వహించిన ఎగ్జిబిషన్ అందరిని ఆకట్టుకుంది. ఈ ఎగ్జిబిషన్ కు వివిధ పాఠశాల నుంచి దాదాపు 36 ఎగ్జిబిట్స్ రాగా ఎన్జీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ విద్యాసాగర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించి విజేతలను ప్రకటించారు.

మొదటి విజేతగా మంచిర్యాల జడ్పీహెచ్‌ఎస్ (బాలికలు), చెన్నూర్ కేజీబీవీ రెండవ, బెల్లంపల్లి కేజీబీవీ మూడవ విజేతగా నిలిచారు. జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజగోపాల్, డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్ రెడ్డి, స్థానిక పాఠశాల హెచ్‌ఎం రమేష్, ఏసీజీఈ మల్లేష్, వివిధ పాఠశాలల విద్యార్థులు, గైడ్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.