31-12-2025 12:38:12 AM
దండేపల్లి, డిసెంబర్ 30 : ఏఐసీసీ, టీపీసీ సీ పిలుపు మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చవద్దని డిమాండ్ చేస్తూ మంగళ వారం దండేపల్లి మండల ఎంపీడీవో కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఈ పథకాన్ని నిర్వీ ర్యం చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మాను కోవాలన్నారు.
మహాత్మాగాంధీ పేరు ఉపాధి పథకం నుంచి తీసేస్తే దేశ వ్యాప్తంగా నిరసన లు చేపడతామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్డీఓ కిషన్ కి అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆర్ జీ పీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, సర్పంచులు, కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.