calender_icon.png 20 January, 2026 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వేఛ్చా సమానత్వంకోసం పోరాటం..!

20-01-2026 12:09:56 AM

గ్రామాల్లో ఐద్వా జెండా పండుగ

కారేపల్లి జనవరి 19 (విజయ క్రాంతి): మహిళలకు స్వేఛ్చా సమానత్వం కోసం ఐద్వా పోరాటాలు చేస్తుందని ఐద్వా వైరా డివిజన్ అధ్యక్షురాలు కొండబోయిన ఉమావతి అన్నారు. సోమవారం కారేపల్లి మండలం మాణిక్యారం, గాంధీనగర్లో ఐద్వా జాతీయ మహాసభలు పురష్కరించుకోని జెండాను ఎగరవేశారు. ఈసందర్బంగా ఉమావతి మాట్లాడుతూ ఈనెల25 నుండి 28 తేదివరకు హైదారాబాద్లో జరుగు ఐద్వా జాతీయ మహాసభలు దేశంలో మహిళ ఉద్యమాలకు దిశానిర్దేశం చేయనున్నాయ న్నారు.

మహిళలు అన్నింటిలో ముందున్నా ఇంతా ఆర్ధిక, రాజకీయ సాంఘీక సమాన త్వంలో రాలేదన్నారు. ఆశాస్త్రీయ భావాలతో మహిళలను వంటింటికే పరిమితం చేసే పాలకుల విధానాలపై చైతన్యం కావాల న్నారు. మహిళలపై పెరుగుతున్న హింస, అత్యాచారాలపై సంఘటీతంగా పోరాడుదా మన్నారు. ఈనెల 25న హైదరాబాద్లో జరుగు ఐద్వా బహిరంగ సభకు తరలిరావా లని కోరారు. ఈకార్యక్రమంలో ఐద్వా వైరా డివిజన్ కమిటీ సభ్యులు సురబాక ధనమ్మ, కేసగాని నీలిమ, మేకల స్వరూప రాణి, బానోతు సరోజ తదితరులు పాల్గొన్నారు.