20-01-2026 12:09:14 AM
ఆదివాసుల పట్ల చిత్తశుద్ధి లేని సీఎం పర్యటన
ఆదివాసుల ఉసెత్తని క్యాబినెట్ సమావేశం మేడారంలో ఎందుకు?
తుడుందెబ్బ నేతల తీవ్ర విమర్శలు
మహబూబాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి అ ధ్యక్షతన నిర్వహించింది.. క్యాబినెట్ సమావే శం కాదని కేవలం రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రులు వారి కుటుంబ సభ్యుల వనదేవతల ప్రత్యేక దర్శనం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం అని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ ఆగబోయిన రవి విమర్శించారు.
సోమ వారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణాలో ఆదివాసీల అభివృద్ధి పట్ల ప్ర భుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని తేటతె ల్లం అయిందని, రాష్ట్ర ముఖ్య మంత్రి గత మూడు రోజులుగా ఆదివాసీల ప్రాంతాలైన ఆదిలాబాద్, ఖమ్మం, ములుగు జిల్లాల్లో ప ర్యటన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం, ఆదివాసీల అభివృద్ధి పట్ల ఏ విధానాలను అవలం భించ బోతుందో, ఆదివాసీల సంక్షేమం కో సం పని చేసే కార్యాలయాలకు నిధుల మం జూరుతో పాటు వాటి పనితీరు మెరుగు ప ర్చేందుకు ఏదైనా ప్రకటిస్తారని ఆశించామన్నారు.
అలాగే కొత్తగా ఆదివాసి సంక్షేమా నికి ప్రత్యేకంగా పథకాలు అమలు చేస్తారని అంతా ఆశతో ఎదురు చూశామని చెప్పారు. అయితే మంత్రివర్గంలో ఆదివాసీల గురించి ఎటువంటి చర్చ చేయకపోవడం, ఆదివాసీలను విస్మరించడమేనన్నారు. ఆదివాసీ బిడ్డ నని,తనను గెల్పిస్తే, ఆదివాసుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చే స్తానని, ప్రభుత్వంలో కీలక మంత్రి పదవిలో కొనసాగుతున్న స్థానిక మంత్రి సీతక్క కూడ ఆదివాసీల అభివృద్ధి పట్ల రెండు ఏళ్ల కాం గ్రెస్ పాలనలో ఎలాంటి హామీలు ఇచ్చిన దాఖలాలు లేవని,ఆదివాసీ జాతి ప్రజలు స దరు మంత్రి పై పెట్టుకున్న ఆశలు అడియాశలుగా మిగిలయాన్నారు.
ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సీతక్క మీద ఎన్నో ఆశలు పె ట్టుకున్న ఏజెన్సీ ప్రాంత యువత మా కోసం కనీసం ఏజెన్సీ డియస్సి, జీఓ నంబర్ 3 పునరుద్దరణ, లేదా అదే స్థానంలో కొత్త జి ఓ ను తీసుక వచ్చి 29 శాఖల్లో ఉండబడిన ఉద్యోగ నియామకాల్లో అవకాశాలు కల్పించే దిశగా ఒక చట్టం తీసుకు వచ్చే విధంగా పా టు పడుతుందని అనుకుంటున్నారన్నారు. భారత రాజ్యాంగంలోని హక్కులు,
చట్టాల అమలు, పొడుభూములకు రక్షణ కల్పిస్తామని కూడ ఏ విషయం లోను ఆదివా సుల కు హామీ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకు ఓట్లు వేసి ఆదివాసులు అండగా నిలబడి ప్రభుత్వం, ఏర్పాటు కు ప్రధాన కారణమైతే, అడవి బిడ్డలకు సియం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదివాసీల ప్రాంతంలో పర్యటన చేసి ఆదివాసులకు పంగనామాలు పెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇకనైనా ఆదివాసుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కనబర్చ కుంటే రాబోయే రోజుల్లో ఆదివాసులు తగి న గుణగుణపాఠం చెపుతారని హెచ్చరించా రు. ఈ సమావేశం లో అల్లెం జంపయ్య, సిద్దబోయిన సంజీవ్, ఈక విజయ్ కుమార్, బూర్క పవన్ లు పాల్గొన్నారు.