29 June, 2026 | 1:06 AM

ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు బాయి చుట్టూ..

29-06-2026 12:04 AM

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరోహీరోయన్లుగా నటిస్తున్న సినిమా ‘సర్కారు బాయి’. ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్పణలో తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. బాహుబలి ప్రభాకర్, వివరెడ్డి, నాగ మహేశ్, దిల్ రమేశ్, చలాకీ చంటి, చిట్టిబాబు, శివానిరెడ్డి, నుపూర్ ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబిస్తూ నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటం వంటి అంశాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు దర్శకుడు లారా.

ఈ నెల 17వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హీరో శ్రీరామ్ నిమ్మల, హీరోయిన్ వర్షికతోపాటు ప్రధాన తారాగణమైన బాహుబలి ప్రభాకర్, నాగమహేశ్‌లు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. జూలై నెలాఖరు వరకు ఈ భారీ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ చిత్రానికి సంగీతం: కే శివ; డీవోపీ: అమర్ జీ; ఎడిటర్: బీఎన్ రెడ్డి.