29 June, 2026 | 1:06 AM

హైదరాబాద్‌లో పతాక సన్నివేశాల చిత్రీకరణ

29-06-2026 12:05 AM

సాయి దుర్గ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ నటుడు కీలక పాత్ర పోషిస్తుండగా, ఐశ్వర్యలక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్న ప్రదేశాల్లో పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు చివరి దశలోకి చేరింది.

ఈ చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించింది. ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ చివరి షెడ్యూల్‌లో పలు కీలకమైన ఘట్టాలను షూట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ఈ అద్భుతమైన యాక్షన్ -ప్యాక్డ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే పోస్ట్-ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. నిర్మాతలు ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: వెట్రి పళనిసామి; సంగీతం: బీ అజనీష్ లోక్‌నాథ్; ఫైట్స్: కెవిన్ మాస్టర్; ఎడిటర్: నవీన్ కట్స్; ప్రొడక్షన్ డిజైన్: గాంధీ నడికుడికర్.