11-11-2025 12:48:24 AM
-రైతులను విస్మరిస్తున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు
-మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజం
ఆదిలాబాద్, నవంబర్ 10 (విజయక్రాం తి): సోయాబీన్ పంట కొనుగోళ్లలో వేలిముద్ర నిబంధనలను తొలగించి రైతులకు, రైతు కుటుంబాలకు సౌకర్యంగా ఉండే ఓటీపీ విధానం ద్వారా కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అద్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. పత్తి కొనుగోలు విధంగానే సోయా కొనుగోలను ఓటిపి విధా నం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. సోమవారం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశాన్ని నిర్వహించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మీడియాకు వివరించారు.
రైతన్నకి అండగా ఉండాల్సిన స్థానిక బీజేపీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లు రైతులపై దృష్టి సారించకుండా రాజకీయ స్వలాభిపేక్ష పై దృష్టి సారించడం సిగ్గుచేటు ధ్వజమెత్తారు. రైతులపై కనీస చిత్తశుద్ధి లేని ఎంపీ, ఎమ్మెల్యేలు అనవసర రాద్ధాంతం చేస్తూ అన్నదాతలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్రం పరిధిలోని ఫసల్ బీమా యోజన గురించి కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం దేనికి నిదర్శనమని జోగు రామన్న మండిపడ్డారు.
తేమ శాతం నిబంధనలతో రైతులు ఓ వైపు అల్లాడుతుం టే... ఎంపీ, ఎమ్మెల్యే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫసల్ బీమా యోజన గడువు పూర్తయిన తర్వాత ప్రస్తుతం రాద్ధాం తం చేస్తే ఫలితం ఏంటన్న ఆయన... పథకం ప్రీమియం తామే కడతామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కేవలం స్వార్ధ రాజకీయాల కోస మే రైతులను వాడుకుంటున్నారని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తడిసి ఉన్న సోయాను సైతం కొనుగోలు చేశామని, సోయా పంటకు తేమ నిబంధననే ఉండేదికాదని గుర్తు చేశారు.
రైతులు అరిగో స పడుతుంటే... ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. రైతుకు న్యాయం జరి గేంత వరకు వారి తరపున బిఆర్‌ఎస్ పార్టీ వారికి అండగా నిలబడుతుందని స్పష్టం చేశా రు. రైతు సంక్షేమాన్ని విస్మరిస్తే ఎంపీ, ఎమ్మెల్యేలను రోడ్లపై తిరగనివ్వమని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజ య్, ఇజ్జగిరి నారాయణ, గండ్రత్ రమేష్, చెందాల రాజన్న, స్వరూప రాణి, ధమ్మా పాల్, వాగ్మారె ప్రశాంత్ పాల్గొన్నారు.