calender_icon.png 11 November, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ స్కూళ్లలో ఐదో తరగతి

11-11-2025 12:47:58 AM

వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ డైరెక్టర్

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 5వ తరగతిని ప్రవేశపెట్టనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని అధికారులు చూస్తున్నారు. ఇందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పంపించారు.

ఐదో తరగతిని ప్రవే శపెట్టి ప్రత్యేకంగా ఎంట్రెన్స్ టెస్టు నిర్వహించకుండా గురుకులాల ఎంట్రెన్స్‌లో మెర్జ్ చేసి, అడ్మిషన్లు చేపట్టాలని అనుకుంటున్నారు. ప్రతి స్కూళ్లో అదనంగా రెండు గదులు నిర్మించి, ఐదో తరగతి నిర్వహించనున్నారు. దీనికి రూ.73 కోట్లు అవుతోందని, ఇందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి డైరెక్టర్ ప్రతిపాదనలు పంపించారు.