11-11-2025 12:49:39 AM
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య
భీమారం, నవంబర్ 10: మంచిర్యాలను అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నా రు. సోమవారం మండలంలోని ఓబీలు, వీఓఏలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్‌తో కలిసి హాజరై మాట్లాడారు. అమ్మకు అక్షరామాల కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలని, ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగానిరక్షరాస్యులను గుర్తించి వారికి చదువునేర్పించేందుకు వాలంటీర్ టీచర్స్ ను గుర్తించి ఉల్లాస్ ఆప్‌లో నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామ స్థాయిలో ఉల్లాస్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని, అంకితభావంతో అందరూ కలిసి విజయవంతం చేసిజిల్లాను అక్షరాస్యతలో ప్రథమ స్థానం లో నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఏపీఎం శ్రీనివాస్ గౌడ్,మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.