26 May, 2026 | 1:04 PM

Breaking News

గాంధీ ఆస్పత్రి నుంచి ఖైదీ పరార్   •   సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •  

తెలుగులో తొలి ఏఐ సినిమా అంబ’S రివేంజ్

03-04-2026 12:00 AM

పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి తెలుగు చలనచిత్రం ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది. “అంబ’s రివేంజ్‌” పేరుతో ఈ చిత్రాన్ని శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిలమ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్‌రెడ్డి కుందూరు నిర్మాత కాగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పౌరాణిక చిత్రాన్ని మహాభారతంలోని శక్తిమంతమైన పాత్ర అంబ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్‌రెడ్డి కుందూరు, క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి మాట్లాడుతూ.. “తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. అంబ’s రివేంజ్ ప్రాజెక్టు కోసం అత్యాధునిక ఏఐ టూల్స్‌ను వినియోగిస్తూ విజువల్స్, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం” అని తెలిపారు.