సౌత్‌జోన్ చరిత్రలో తొలి మహిళ డీసీపీ
చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 25: కేంద్ర ఎన్నికల సంఘం దక్షిణ మండ లం నూతన డీసీపీగా స్నేహా మెహ్రాను నియామిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లో సౌత్ జోన్ కమిషనరేట్ ఏర్పడిన నాటి నుంచి నేటీ వరకు ఎప్పుడు లేని విధంగా మహిళ అధికారిణికి డీసీపీగా ఈసీ బాధ్యతలను అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్ అధికారుల ను బదిలీ చేసిన సౌత్‌జోన్ డీసీపీగా ఉన్న సాయిచైతన్యను బదిలీ చేయక పోవడంపై అనుమానాలు ఉన్నాయ ని, మజ్లీస్ పార్టీకి అనుకూలంగా వ్యవ హారించే అవకాశం ఉందని హైదరా బాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత ఎన్ని కల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పరిశీలించిన ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం సాయి చైతన్యను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తు తం ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసింది. ఈసీ నిర్ణయం మజ్లిస్ పార్టీకి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ పార్టీతో సం సంబంధాలు ఉన్న అధికారులపై నిఘా పెట్టి, ముక్కుసూటిగా వ్యవహా రించే అధికారిణిని డీసీపీగా నియా మించడంపై హర్షం వ్యక్తం అవు తుం ది. నిజాయితీకి మారుపేరుగా పిలు చుకునే స్నేహా మెహ్రా ఉత్తర్ ఖండ్‌కు చెందిన అధికారిణి. 2018 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె సైబ ర్‌నేరాలు, ఆర్థిక నేరాల విభాగంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. సౌత్‌జోన్ డీసీపీగా శుక్రవారం నుంచే బాధ్యతలను చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.






