8 May, 2026 | 4:31 PM

మొండికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేగా కాంతారావు

08-05-2026 03:28 PM

అశ్వాపురం, మే (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో మాజీ ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్థానికులతో మాట్లాడి గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, మరి మల్లారెడ్డి, కొల్లుమల్లారెడ్డి, డాక్టర్ బాబు మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.