calender_icon.png 19 December, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమీషన్లపై ఉన్న శ్రద్ధ.. అభివృద్ధిపై లేదు

19-12-2025 01:08:57 AM

  1. అబద్ధ్దాల ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
  2. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్ ఫైర్

నిర్మల్, డిసెంబర్ 1౮ (విజయక్రాంతి): నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచి బీజేఎల్పీ నేతగా ఎన్నికైన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ పబ్బం గడుపుతున్నారని డిసిసి అధ్యక్షులు వేడుమ బొజ్జు పటేల్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. గురువారం నిర్మల్ మయూరి హోటల్ లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు.

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిజెపి మద్దతు సర్పంచులు ఎక్కువగా గెలుచుకున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని దమ్ముంటే సర్పంచ్లు జాబితాను ప్రకటించాలన్నారు. నిర్మల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎమ్మెల్యే రెండు సంవత్సరాల్లో నిర్మలకు ఒక్క రూపాయి కొత్త నిధులు తీసుకురాలేదని గతంలో మంజూరైన అభివృద్ధి పనులను కమీషన్ల కోసం అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఎన్నికలకు ముందు సండే ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత మంత్లీ ఎమ్మె ల్యే ఎన్నికల పూర్తి కాగానే క్వార్టర్లు ఎమ్మెల్యే గా ప్రజలు పిలుచుకునే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. నిర్మల్ జిల్లాలో సర్పంచ్ల ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీ డ్బ్బు శాతం సీట్లను గెలుచుకుందని ఆ జాబితా తమ వద్ద ఉందన్నారు. ఎన్నికలు మతాలు కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

దేవు ళ్ళ పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్న మహేశ్వర్ రెడ్డికి త్వరలో ఆ దేవుడే రాజకీయ గుణ పాఠం చెప్తారని ఎద్దేవో చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు విశ్వసించడం వలన జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలిచామన్నారు వచ్చే మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని పార్టీలో ఎలాంటి గ్రూపు విభేదాలు లేవని సమన్వయంతో ముందుకు పోతున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో గ్రంథాల య చైర్మన్ సయ్యద్ అర్జున్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ పార్టీ నాయకులు భీమ్ రెడ్డి ధర్మాజీ శ్రీనివాస్ సమరసింహారెడ్డి పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి దుర్గాభవాని నాందేడ్ చిన్ను తదితరులు ఉన్నారు.