18-01-2026 05:37:25 PM
... ఐకమత్య అనిపించేందుకు క్రీడలు తోడ్పడతాయి..
... మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
... సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో యరగండ్లపల్లి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్..
మర్రిగూడ,(విజయక్రాంతి): యువత చదువుతోపాటు క్రీడలపై కూడా దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ... క్రీడలు యువకుల మధ్య స్నేహ భావాలు పెంపొందించడమే కాకుండా ఐకమత్యానికి అన్నారు.
ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయస్థాయిలో ఉత్తమ స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. ఆటల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు స్ఫూర్తిగా కోరుకుంటూ స్నేహభావంతో మెలగాలని సూచించారు. అనంతరం సర్పంచ్ సంతోష్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ ముత్యాలమ్మ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఇక నుంచి ప్రతి ఏట మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు ప్రకటించారు. క్రీడాకారులు సహకరించి టోర్నమెంటును విజయవంతం చేయాలని కోరారు.