calender_icon.png 30 December, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ వేడుకలు

29-12-2025 01:46:41 AM

  1. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,

జిల్లా పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు 

ప్రజలందరికి కాంగ్రెస్ పార్టీ 140 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 28 (విజయక్రాంతి): భారత దేశ ప్రజలకు అండగా 140 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉ ద్యమాలు జరిగాయి.ఆనాడు గాంధీ నేతృత్వంలో స్వంతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టింది.జవహ ర్ లాల్ నెహ్రూ,ఇందిరాగాంధీ,రాజీవ్ గాం ధీ, మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా దే శాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.

గ్రా మంలోని ప్రతి పేద ఇంటికి సంక్షేమ పథకా లు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా త్రమే అందాయి.పది సంవత్సరాల బీజేపీ పాలనలో దేశంలో కులాల మతల ప్రాతిపదికన పాలన సాగిస్తుంది.పేద ప్రజల ఉపాధి కోసం ప్రారంభించిన పథకాలకు మహాత్మా గాంధీ పార్టీ పేరును తొలగిస్తుంది.పేరు తొలగించినంత మాత్రాన ప్రజల నుంచి గాంధీ ని దూరం చేయలేరు.కాంగ్రెస్ పార్టీ దేశంలోని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప నిచేస్తుంది.

ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామిగా నిలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ .నా లుగు కోట్ల ప్రజల కోరిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.ప్రజలకు ఎక్క డ అన్యాయం జరిగిన వారికి అండగా కాం గ్రెస్ పార్టీ ఉంటుంది. దేశంలో గరీబీ హటా వో,బ్యాంకుల జాతీయకరణ,ఉపాధి హామీ పథకం వంటి అనేక పథకాలు అమలు చే సింది.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ నేత రాహుల్ గాంధీ సూచనలు సలహాలతో రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.కాంగ్రెస్ పార్టీ జెం డా పేద ప్రజలకు అండగా ఉండి వారి అ భ్యున్నతికి కృషి చేస్తోంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నకాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్. మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి సెస్ సుధాకర్ బ్లాక్ కమిటీ అధ్యక్షుడు సుర దేవరాజ్ మాజీ కౌ న్సిలర్ బాల్ రాజు సీనియర్ నాయకులు నరసయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.