calender_icon.png 30 December, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుకాణాలకూ టార్గెట్..!

29-12-2025 01:49:27 AM

మద్యం వ్యాపారుల నుండి వసూళ్లు

కరీంనగర్, డిసెంబరు 28 (విజయ క్రాంతి): ఎక్సైజ్ అధికారులకు తీసిపోకుండా ఐఎంఎల్ డిపో కూడా టార్గెట్లను నిర్ణయిస్తుండదుతో వ్యాపారులు ఆందోళన చెందు తున్నారు. నూతన సంవత్సరం కోసం పెద్ద ఎత్తున మధ్యం లిఫ్టు చేస్తున్న పాపుల నుంచి టార్గెట్ ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో మద్యం దుకాణానికి ఎంట్రీ ఫీజుగా 4 వేల రూపాయలు నిర్ణయించినట్లు తెలిసింది. వీ రి చర్యల వల్ల నూతనంగా మద్యం దుకాణాలు దక్కించుకున్న యజమానులు ఆందో ళన చెందుతున్నారు.

నెలవారి ఇచ్చేది షరామాములే అయినప్పటికి ఎంట్రీ ఫీజు నిర్ణ యించడం వివాదానికి దారితీసింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని వ్యాపా రులు కోరుతున్నారు. ఐఎంఎల్ డిపోలో అక్రమాలు చోటు చేసుకోవడం కొత్తేమీ కా దు. గతంలో ఒక కాంట్రాక్టు ఉద్యోగి మద్యం డిపోలు నడిపించడం విమర్శలకు దారితీసింది. కొందరు ఇదే డిపోలో పనిచేస్తు న్నవారు స్వంత వాహనాలు ఏర్పాటు చేసుకొని ట్రాన్స్పోర్టు చేస్తుండడం విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం 31 డిసెంబర్, జనవరి 1 మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటా యి.

దుకాణదారులు పెద్ద ఎత్తున స్టాక్ తీసుకునేందుకు డీడీలు తీస్తున్నారు. తమతమ పరిధిలో ఎక్కువగా అమ్ముడయ్యే మద్యం బ్రాండ్లు ఎక్కువగా కావాలనుకుంటే ఈ డిపో వారిని మచ్చిక చేసుకోవాల్సిందే. నిజానికి ఏయే బ్రాండ్ ఎంత వరకు స్టాక్ ఉ న్నాయో మద్యం వ్యాపారులు తెలుసుకుని డీడీలు తీసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ యాప్ లో బ్రాండ్ల వారీగా స్టాక్ వివరాలు ఉంటాయి.

దీనికి తగ్గట్లుగా వ్యాపారులు మద్యం దిగుమతి చే సుకునేందుకు డీడీలు తీస్తుంటారు. అయితే డిపోలోని కొందరు అధికారులు స్టాక్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ రేషన్ విధానం కారణంగా ఇవ్వలేకపోతున్నామని చెబుతూ తమకు అనుకూలంగా ఉన్నవారికి స్టాక్ ఇ స్తున్నారు. ఈ విధానంతో పాత వ్యాపారులు ఎక్కువ మొత్తంలో స్టాకు లిఫ్టు చేస్తుండడంతో కొత్త దుకాణదారులు గగ్గోలు పెడు తున్నారు.

కరీంనగర్ ఐఎంఎల్ డిపో నుండి ఉమ్మడి జిల్లా పరిధిలోని 248 మద్యం దుకాణాలను మద్యం రవాణా అవుతుంది. ఇక్కడ ట్రాన్స్పోర్టుకు సంబంధించి కూడా కొందరు ఉద్యోగులు వాహనాలు ఏర్పాటు చేసుకుని వారి వాహనాలు వినియోగించేలా మద్యం వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారు. రే షన్ పద్ధతిలో మద్యం అందించాలని ఈ టో కెన్ వసూళ్లు ఆపాలని వ్యాపారులు కోరుతున్నారు.

- నకిలీ మద్యం వచ్చే ఛాన్స్.....

ఇటు ఎక్సైజ్ అధికారులు, ఐఎంఎల్ డిపోల వారి ఒత్తిడులతో మద్యం వ్యాపారు లు ఇష్టం ఉన్న రేట్లకు అమ్ముకునే ఛాన్స్ తో పాటు నకిలీ మద్యం ఏరులై పారే అవకాశం ఉంది. ఇప్పటికే రామగుండం, కోరుట్ల లాం టి ప్రాంతాల్లో నకిలీ మద్యం సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ సత్వరమే స్పందించి నెల నెలవారి ఇచ్చేవి కాకుండా టార్గెట్ నిర్ణయించి వసూలు చేసే తీరును ఆపకుంటే నకిలీ మద్యం ఉమ్మడి జి ల్లావ్యాప్తంగా ఏరులై పారే అవకాశం ఉంది. బెల్టు పాపుల్లో కూడా నకిలీ మద్యం అమ్మకాలు జరిగే అవకాశాలు