19 March, 2026 | 3:51 AM

ముదురుతున్న నిధుల ‘పంచాయతీ’

19-03-2026 12:26 AM
  1. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.20 కోట్ల విడుదల

నిధుల విడుదలతో కొత్త, పాత సర్పంచ్ల మధ్య తలెత్తిన వివాదం

ప్రభుత్వం నుంచి స్పష్టమైన గైడ్లైన్స్ జారీ..

మెదక్, మార్చి 18 (విజయ క్రాంతి) : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో బిల్లుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మా రింది. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను మంజూరు చేసింది. గ్రామంలో అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుంటుందని సర్పంచులు భావించారు. అయితే నిధులు మం జూరైన వెంటనే పాత పనులకు సంబంధించిన బిల్లుల అంశం తెరపైకి వచ్చింది. దీంతో అనేక గ్రామ పంచాయతీ ల్లో వివాదం నెలకొంటుంది.

కొత్త సర్పంచులు...మాజీ సర్పంచుల మధ్య నిధుల పంచాయితీ 

గతంలో ఉన్న పాలకవర్గాలు చేసిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు పూర్తు న తర్వాత కొత్త పనులకు సంబంధిత నిధులను వినియోగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా కొత్త సర్పంచ్లు-మాజీ సర్పంచ్ల మధ్య నిధుల పంచాయితీ ముదిరింది. ఈ లొల్లి చివరకు జిల్లా పం చా యతీ అధికారుల వద్దకు చేరింది. గతం లో మేం చేసిన పనులకు బిల్లులు ఇచ్చేందుకు కొత్త పాలకవర్గం పేచీ పెడుతున్నదని కొంద రు మాజీ సర్పంచ్లు చెబుతున్నారు.

అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నా ఆయా పంచాయతీల్లో గత పాలకవర్గం చేసిన పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చే యాలని చెప్పినా.. కొంతమంది సర్పంచ్లు విడుదలైన నిధులు మీకిస్తే మాకేంటంటూ వివాదానికి తెర తీస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

 నిధులు మీకిస్తే మాకేంటి....! 

2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. గతంలోని పాలకవర్గాలు కూడా పంచాయతీల్లో సొంత డ బ్బులు పెట్టి పనులు చేయించగా నిధులు రాకపోవడంతో రెండేండ్లుగా నిధుల ఎప్పు డు వస్తాయం టూ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే నిధులు విడుదల అయిన అ నంతరం చేసిన పనులకు బిల్లులకు ఆమో దం తెలపాలని కొత్త పాలకవర్గాలను కోరితే వారు ససేమిరా అంటుండడంతో పంచాయితీ మొదలైంది. జిల్లాలోని కొన్ని పంచా యతీలు మినహా మెజార్టీ గ్రామాల్లో బిల్లుల లొల్లి మొదలైంది.

పాత పాలకవర్గం చేసిన పనులకు నిధులు రావడం, బిల్లులకు ఆమోదించాల్సి ఉండడంతో చాలా మంది సర్పం చులు.. ఆ నిధులను మీకిస్తే మేము ఏమి చేయాలంటూ వాగ్వాదానికి దిగుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మరికొందరు స ర్పంచులు మీ బిల్లులకు ఆమోదం తెలపాలంటే కమీషన్ ఇవ్వాల్సిందేనని షరతులు పెడుతున్నట్లు మాజీ సర్పంచులు ఆరోపిస్తున్నారు.

 మొత్తం బిల్లులు ఇవ్వం...? 

నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చే స్తున్నారు. గ్రామ పంచాయతీలకు విడుదలైన నిధులను పూర్తిగా పాత బిల్లులకు చెల్లి స్తే గ్రామాల్లో కొత్తగా అభివృద్ధి కార్యక్రమా లు ఎలా చేపట్టాలని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం వచ్చిన నిధుల్లో కొంత చెల్లిస్తామ ని.. రాబోయే నిధుల్లో మరి కొంత చెల్లిస్తామని కొత్త సర్పంచులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీల్లో గతం లో పనిచేసినట్టు ఎంబి రికార్డులు ఉంటే బిల్లుల చెల్లింపులు సులభంగా జరుగుతున్నాయి. పీఆర్, ఆర్ డబ్ల్యూఎస్ విభాగాల్లోనీ ఇంజనీర్లు పనిచేసినట్టు ఎంబి రికార్డులు చేశారు. వీటికి బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే గ్రామాల్లో రికార్డులు లేకుండా.. వ్యా పారుల వద్ద నుంచి తెచ్చిన బిల్లుల విషయంలో కొత్త సర్పంచులు పేచీ పెడుతున్నారు. మెదక్ జిల్లాలో అనేక గ్రామాల్లో ఇలాంటి బిల్లుల పంచాయతీ నడుస్తుంది.