16 March, 2026 | 3:07 AM

భారత్‌లో గంగా-జమునా సంస్కృతి

16-03-2026 01:32 AM
  1. ఇక్కడ అన్ని మతాల వారు కలిసి సుఖంగా జీవిస్తున్నారు 

ఇలాంటి శాంతి, సమైక్యత ప్రపంచంలో అరుదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): భారత్‌లో గంగా-జమునా సంస్కృతి కొనసాగుతుందని, ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు సుఖం గా జీవిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టంచేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మైనార్టీ మోర్చా ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాం టి శాంతి, సమైక్యత ప్రపంచంలో అరుదుగా ఉంటుందన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఉన్నా, మన దేశం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో శాంతి, స్థిరత్వంని అనుభవిస్తున్నట్టు పేర్కొన్నారు.

అల్లాపై విశ్వాసం ఉన్నవారు తమ ప్రార్థన స్వేచ్ఛగా చేసుకోవచ్చని స్పష్టంచేశారు. రాముని ఆరాధకులు స్వేచ్ఛగా పూజించవచ్చు అన్నారు. జైనులు తమ సంప్రదాయా లను కొనసాగిస్తారని ఇది భారతదేశం.. అన్ని మతాల ప్రజలు సఖ్యతతో నివసిస్తారని తెలిపారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సమైక్యత సూత్రం ఆధారంగా, మనం మతం ఏదైనా, రాష్ట్రం ఏదైనా ముందు మనమంతా భారతీయులు అని గుర్తించాలన్నారు. భారతాన్ని రక్షించాల్సిన బాధ్యత మనదేనని రాంచందర్‌రావు పిలుపునిచ్చారు.